Guppedantha Manasu October 21st Episode : వసుధారతో, రిషిని ఇంకా సార్ అని పిలుస్తున్నావేంటి అని క్లాస్ ఇస్తాడు మహేంద్ర. ఇంకా, సార్ అని పిలుస్తావంటే, రిషి అని పిలువు లేదంటే ఏవండి అని పిలువని చెప్తాడు. అప్పుడు వసుధార కొంచెం టైం కావాలని అంటుంది. జగతిని మాత్రం నోరార అత్తయ్య అని పిలిచావు. కానీ, నన్ను మాత్రం ఇంకా సార్ అంటున్నావ్. ఏంటి మావయ్య అని పిలువు అని ఎమోషనల్ అవుతాడు. మావయ్య అని పిలవడంతో, మురిసిపోతాడు మహేంద్ర. మీరిద్దరూ వెళ్లి ఎంజాయ్ చేసి రండి అని మహేంద్ర అంటాడు. మీరు కూడా రండి మావయ్య అని అంటుంది.
కానీ, ఈరోజు మీరు ఇద్దరు వెళ్లండి. రేపు నేను వస్తాను అని పంపించేస్తాడు. ఇకనుండి మీరు ఎక్కడికి వెళ్లొద్దని చెప్పి మరీ వెళ్తారు. సరేనన్న మహేంద్ర, మీరు బాగా ఎంజాయ్ చేసి రండి అని చెప్తాడు. వాళ్లు అటు వెళ్ళగానే జగతి ఫోటో చూస్తూ, మళ్ళీ బాధలో కూరుకుపోతాడు. వసుధార, రిషి బైక్ మీద తిరుగుతూ ఉంటారు. వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తారు. వసుధార స్లిప్ అయితే, రిషి పట్టుకుని జాగ్రత్తలు చెప్తాడు. మీరు ఉండగా నాకేం కాదని వసుధార అంటుంది. ఇద్దరు కలిసి ఎవరు గొప్పో చెప్పుకుంటారు. మళ్ళీ, ఐ లవ్ యు చెప్తుంది వసుధార. మరోవైపు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదని, శైలేంద్ర కంగారు పడిపోతాడు. ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. రిషి కి కాల్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుని కాల్ చేస్తాడు.
వసుధార లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నారు ఏమైనా సహాయం కావాలా అని శైలేంద్ర అంటాడు. మాకు, మీ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అక్కర్లేదు. మీ పని మీరు చూసుకుంటే మంచిది. అదే, మాకు మంచిదని క్లారిటీ ఇస్తుంది. రిషి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడని అడుగుతాడు. మేము ప్రశాంతంగా ఉన్నాం. మీకు నా నుండి సమాధానం రాదు. నాకు తెలిసి, లైఫ్ లో మీ అవసరం మాకు రాదు అని అంటుంది. అలా రాకుండా చూసుకునే బాధ్యత మాది. మా అదృష్టం కొద్దీ ఏమైనా వస్తే అప్పుడు కాల్ చేస్తానని ఫోన్ కట్ చేసేస్తుంది.
డాడీ కి తెలిసి ఉంటుంది. నువ్వు డాడీ ని అడుగు మమ్మీ అని చెప్తాడు. ఇంతలో ఫణింద్ర భోజనానికి వస్తాడు. దేవయాని డ్రామాని మొదలు పెడుతుంది. జగతి వెళ్ళిపోతూ, ఇంటి సంతోషాన్ని కూడా తీసుకెళ్లిపోయింది. నాకు రిషి పై బెంగ పట్టుకుంది. కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి అని దేవయాని అంటుంది. ప్రశాంతత కోసం వాళ్లు వెళ్తే నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేయమంటున్నావు అని ఫణింద్ర అంటాడు. వాళ్లకి ఏదైనా అపాయం జరిగితే అని దేవయాని అంటుంది. అప్పుడు ఫణింద్ర ఏంటి అపసకునం మాటలు, బుద్ధి లేదా అని మండిపడతాడు.
ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదా, అసలు వాళ్ల మీద ఎందుకు ఇంత ప్రేమ వలకబోస్తున్నావ్..? అసలు మహేంద్ర ఇంటి నుండి బయటకు వెళ్ళిందే నీ వల్ల. నువ్వు నోటికొచ్చిన మాటలని వెళ్ళగొట్టావు. వాళ్ళ ఇంటికి వెళ్లి, రమ్మని పిలిచినా కూడా రానని చెప్పారు. ఇంత చేసి మళ్ళీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్..? నువ్వు ఏం చేస్తున్నావు..? నీకి జన్మకి అర్థం కాదు. మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు, మాటలు తూలడం, బయటికి వెళ్లిన తర్వాత ప్రేమ కురిపించడం అవసరమా..? చీటికిమాటికి నన్ను విసిగించవద్దని వార్నింగ్ ఇస్తాడు.
ఎంత ట్రై చేసినా, మావయ్య రిషి వాళ్ల గురించి మీకేం చెప్పరు అని అనుకుంటుంది ధరణి. శైలేంద్ర సార్, రిషి సార్ కి ఎందుకు కాల్ చేశారు..? మేమున్న ప్లేస్ ని కనుక్కొని ఏదైనా అటాక్ చేయిద్దాం అనుకుంటున్నారా..? అవును తన ధోరణి అదే అని అంటుంది వసు. ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనలో ఆమె పడుతుంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఏడిపిస్తూ ఉంటారు వసుధారని. ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి, బెదిరించడంతో వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావని, మహేంద్ర అడుగుతాడు.
శైలేంద్ర కాల్ చేసిన విషయం చెప్తుంది. అన్నయ్య వలన ఏం చేయలేకపోతున్నాను. కానీ, చంపేయాలన్న కోపం వస్తోంది అని బాధపడతాడు మహేంద్ర. అన్ని ఆధారాలు సేకరించి ఏ శిక్ష వేయాలో రిషి సార్ కి వదిలేయాలి అని వసుధార అంటుంది. ఇందులో డాడ్ అంటూ ఎంట్రీ ఇస్తాడు రిషి. ఎవరిని వదిలి పెట్టకూడదు అంటున్నారు అని అడుగుతాడు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు రిషి. అంతే, ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…