Buttermilk : ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా చలికాలం ముగిసింది. ఎండలు అప్పుడే విజృంభిస్తున్నాయి. ఇక రానున్న నెలల్లో వేడి మరింత పెరగనుంది. దీంతో వేసవి తాపం మొదలవుతుంది. ప్రజలు ఇప్పుడే శరీరాన్ని చల్లబరుచుకునే మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే రకరకాల పానీయాలను సేవిస్తున్నారు. ఇక వేసవిలో చాలా మంది తాగే పానీయాల్లో మజ్జిగ కూడా ఒకటి. కానీ దీన్ని ఏ సీజన్‌లో అయినా సరే రోజూ తాగవచ్చు. రోజూ ఒక గ్లాస్ మజ్జిగను సేవించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఎండదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. దాంతో పాటు వేసవి తాపం కూడా తీరుతుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు. మజ్జిగలో ప్రొటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కనుక ఈ సీజన్‌లోనే కాదు.. ఎప్పుడైనా సరే రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగాల్సిందే.
అంతే కాదు.. కాల్షియం లోపంతో బాధ పడేవాళ్లు మజ్జిగను తాగితే వాళ్ల ఎముకలు, దంతాలు కూడా దృఢపడతాయి. రోజూ మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవాళ్లు కూడా మజ్జిగను రోజూ తాగొచ్చు. దీంతో పొట్టంతా ఎలాంటి అలజడి లేకుండా ఉంటుంది. కడుపులో మంట కూడా తగ్గుతుంది.
ఎండాకాలం చాలామందికి వేడి చేస్తుంది. ఆ వేడిని తగ్గించుకోవడానికి కూడా మజ్జిగను తాగొచ్చు. అందుకే.. మిట్టమధ్యాహ్నం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ తాగితే కడుపు చల్లగా ఉంటుంది. కనుక మజ్జిగను అంత తేలిగ్గా తీసుకోకండి. దీన్ని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…