Bell In Temple : మన దేశ సంస్కృతిలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత గోచరిస్తుంది. దీనిలో భాగంగా ఒక్కో సంప్రదాయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సహజంగా భారతీయ సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా మనకు మొదటిగా కనపడేది గంట. దేవాలయంలో గంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గుడిలో హారతి సమయంలో, ప్రత్యేకమైన కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు. అసలు దేవాలయంలో గంట ఎందుకు కొడతారు.. అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. గుడిలోకి వెళ్ళగానే ప్రదక్షిణలు చేసిన తరువాత గంట కొట్టి దేవుడిని దర్శించుకుంటాం. అయితే ఆలయంలో కొట్టే గంటకు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి.
దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను, వ్యతిరేక కిరణాలను దూరం చేస్తుంది. అంతే కాకుండా దేవుడి ముందు తమ కోరికను చెప్పుకుని గంట కొట్టడం ద్వారా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. గంట మోగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇళ్ళల్లో కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మోగిస్తే మనసుకి ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది. గంట యొక్క ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గంటను సకల దేవతా స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
గంట నాలుక భాగంలో సరస్వతీ దేవి కొలువై ఉంటుందని, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, పొట్ట భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగంలో గరుడ, చక్ర, హనుమ, నందీశ్వరులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. హారతి సమయంలో అందరు దేవుళ్ళను ఆహ్వానిస్తూ గంటను మోగిస్తారు. అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతుంటారు. ఇక కంచు గంట మోగించినపుడు దానిలో నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఈ ఓంకార నాదం వినడం వల్ల మనిషిలో ఉన్న చింతలు, సమస్యలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకనే ఆలయాల్లో గంటను ఉపయోగిస్తున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…