ఆరోగ్యం

Juices : జ్యూస్‌ను త‌యారు చేసి తాగుతున్నారా.. ఈ 5 పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

Juices : ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఇంట్లో జ్యూసులని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారాన్ని తీసుకోవాలి. అందుకని పోషకాలతో కూడిన జ్యూస్‌ల‌ని చాలామంది తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా రెగ్యులర్ గా జ్యూస్‌ల‌ని తాగుతూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఆచరించడం మంచిది. ఇలా చేయడం వలన పోషకాలు బాగా అందుతాయి. జ్యూస్ తాగిన బెనిఫిట్ మీరు పొందవచ్చు.

చాలామంది ఉదయం పూట అల్పాహారం సమయంలో జ్యూస్ లని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా అలా తాగుతున్నట్లయితే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కొంతమంది జ్యూస్ పేరుతో షర్బత్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ తప్పు చేయకండి. తాజా పండ్లను మీరు జ్యూస్ లలో ఉపయోగించండి. ఎక్కువమంది బాగా తియ్యటి పండ్లని లేదంటే పంచదారని వాడుతుంటారు. అది ఆరోగ్యానికి ఇబ్బందిని కలిగిస్తుంది.

Juices

ఎక్కువగా షుగర్ ని మీరు వేసుకుని తీసుకుంటే ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది. పంచదార లేదంటే తియ్యటి పండ్లు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. జ్యూస్ చేసేటప్పుడు కొన్ని కూరగాయల్ని కూడా మీరు వాడొచ్చు. ఆకుకూరలు, కాయగూరలతో జ్యూస్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బాగా ఎక్కువగా వాటిని వేసుకోవడం వలన రుచి పాడవుతుంది. చేదుగా ఉంటుంది.

కాబట్టి జ్యూస్ లని తీసుకునేటప్పుడు ఈ విషయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకొని వీటిని పాటించడం మంచిది. చాలామంది జ్యూస్ డిస్పెన్సెర్స్ ని వాడుతున్నారు. కానీ వీటిని వాడడం వలన పోషకాలు బాగా తగ్గిపోతాయి. బాగా వేడి వలన పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. క‌నుక‌.. వాటిని వాడేటప్పుడు బాగా వేడిగా అయ్యే వాటిని వాడకండి. ఎప్పుడూ కూడా జ్యూస్ ని ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోకూడదు.జ్యూస్ చేసిన వెంట‌నే తాగేయాలి.

ఉదయం తయారుచేసుకునే జ్యూస్ ని సాయంత్రం పూట తాగడం వలన పోషకాలు అందకపోవడమే కాకుండా అది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇంట్లో తయారు చేసిన జ్యూస్ ని కేవలం 24 గంటలు పాటు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. అయితే ఎప్పటికప్పుడు తీసుకుని ఫ్రెష్ గా తాగడమే మంచిది. జ్యూస్ ని తీసుకునేటప్పుడు విత్త‌నాల‌ని మిక్స్ చేసుకోవద్దు. ఇలా జ్యూస్ లని తాగేటప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM