ఆరోగ్యం

Diabetes Health Tips : దీన్ని వాడితే అస‌లు డ‌యాబెటిస్ అన్న‌ది ఉండ‌దు..!

Diabetes Health Tips : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. సాధార‌ణంగా షుగ‌ర్ ప‌రీక్ష‌లు ప‌ర‌గ‌డుపున చేస్తారు. అలాగే మ‌ర‌లా ఆహారం తీసుకున్న రెండు గంట‌ల త‌రువాత చేస్తారు. ఈ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు సాధార‌ణంగా మ‌నం ఆ ముందు పూట తీసుకున్న ఆహారంపై ఆధార‌ప‌డి ఉంటాయి. మ‌నం అన్నం తీసుకోకుండా చ‌పాతీ, పుల్కా వంటి వాటిని తీసుకుంటే షుగ‌ర్ స్థాయిలు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు ఫ‌లితాలు వ‌స్తాయి. అదే స్వీట్స్, అన్నం వంటి వాటిని తీసుకుంటే షుగ‌ర్ ఎక్కువ‌గా ఉన్నట్టు ఫలితాలు వ‌స్తాయి. షుగ‌ర్ అదుపులో ఉంటే షుగ‌ర్ వ‌చ్చి కాలం అయిన‌ప్ప‌టికి శ‌రీరంలో అవ‌య‌వాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి.

అదే షుగ‌ర్ ఎక్కువ‌గా ఉంటే షుగ‌ర్ వ‌చ్చి త‌క్కువ కాలం అయిన‌ప్ప‌టికి అవ‌య‌వాలు ఎక్కువ‌గా దెబ్బ‌తింటాయి. అయితే ఇలా ఆహారాన్ని తీసుకోవ‌డానికి ముందు, ఆహారం తీసుకున్న త‌రువాత చేసిన ర‌క్త ప‌రీక్ష‌లను బ‌ట్టి షుగ‌ర్ ను అంచ‌వేయ‌డానికి బ‌దులుగా మూడు నెల‌ల‌కు ఒక‌సారి హెచ్ బి ఎ1సి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ర‌క్త‌ప‌రీక్ష‌న్ని బ‌ట్టి షుగ‌ర్ మ‌నం మ‌రింత చ‌క్క‌గా అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఈ హెచ్ బిఎ1సి ఫ‌లితాలు 6 నుండి 7 లోపు షుగ‌ర్ అదుపులో ఉన్నట్టు అర్థం. అదే 6 కంటే త‌క్కువ‌గా ఉంటే షుగ‌ర్ లేన‌ట్టే భావించాలి. అదే విధంగా 8 నుండి 10 లోపు వ‌స్తే షుగ‌ర్ కొద్దిగా ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అర్థం. 10 దాటి వ‌స్తే షుగ‌ర్ అస్స‌లు అదుపులో లేద‌ని అర్థం. ఈ హెచ్ బిఎ1సి ఫ‌లితాలు 6 క‌న్నా త‌క్కువ‌గా రావాల‌న్నా, డ‌యాబెటిక్ పేషెంట్స్ నాన్ డ‌యాబెటిక్ పేషెంట్స్ గా మారాల‌న్నా ముఖ్యంగా మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో మార్పులు చేసుకోవాలి. షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఎక్కువ సార్లు తిని ఎక్కువ మందులు వేసుకోవ‌డానికి బ‌దులుగా రోజుకు రెండు సార్లు తిని ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే షుగ‌ర్ చాలా బాగా అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవ‌లం నీటిని తాగుతూ ఉండాలి.

Diabetes Health Tips

త‌రువాత 250 నుండి 300 ఎమ్ ఎల్ వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. ఒక గంట తరువాత రెండు పుల్కాల‌ను ఎక్కువ కూర‌తో తీసుకోవాలి. ఒక క‌ప్పు పెరుగును కూడా తీసుకోవ‌చ్చు. ఇక 4 గంట‌ల‌కు కొబ్బ‌రి నీళ్ల‌ను లేదా ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. ఇక సాయంత్రం 6 గంట‌ల లోపు నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను, పండ్ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఒక గంట వాకింగ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ చాలా బాగా అదుపులోకి వ‌స్తుంది. హెచ్ బిఎ1 సి లో ఫ‌లితాలు 6 లోపే వ‌స్తాయి. ఈ విధంగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM