Curry Leaves For Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజూ తీసుకుంటే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారకుండా నిరోధిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
కరివేపాకులో విటమిన్లు, బీటా కెరోటిన్, కార్బజోల్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి. కరివేపాకులలో ఫైబర్ సమృద్దిగా ఉండడం వలన శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం కరివేపాకు కషాయం తయారుచేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకు పొడి తయారుచేసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చు.
కరివేపాకును ఏ రూపంలో తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు.. డయాబెటిస్ రాకుండా ఉండాలని అనుకునేవారు కరివేపాకుని తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు కరివేపాకులను నేరుగా అలాగే నమిలి మింగాలి. లేదా కషాయం, జ్యూస్ తాగవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా షుగర్ ఉన్నవారు కరివేపాకులతో లాభాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…