వినోదం

నాగబాబు భార్య పద్మజ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన వేసిన బాటలోనే నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఇండస్ట్రీ కి వచ్చి తమకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సఫలం అయ్యారు. ముఖ్యంగా వీరిలో నాగబాబు గురించి చర్చించుకుంటే అయన క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యారు. ఒక పక్క క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ నిర్మాతగా మారి సినిమాలను తీశారు. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణ రంగం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ మధ్యనే మరలా నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా మారారు.

చిరంజీవి సరైన వయస్సులోనే పెళ్లి చేసుకున్నా.. నాగబాబు మాత్రం 29 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఎవరీ అమ్మాయి బాగుంది అని అనుకున్నదట. పద్మజ పెళ్లి కొడుకు తర‌ఫున అమ్మాయి అయితే.. అంజనాదేవి పెళ్లికూతురు తర‌పున పెళ్ళికి వచ్చారట.

పద్మజ బంధువుల అమ్మాయని తెలిసి అంజనాదేవి సంబరపడింది. ఆమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుండును అని అనుకున్నదట. ముఖ్య విషయం ఏమిటంటే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని. చిరంజీవికి సంబందించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఆల్బమ్ ని తయారుచేసిందట. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఆల్బమ్ ని చూపించేదట. అలాగే వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించటంతో అంజనాదేవి మురిసిపోయి ఆమెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట. తన అభిమాని నాగబాబు భార్యగా రావటం చిరు కూడా స్వాగతించాడు. ఆ విధంగా పద్మజ నాగబాబును పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలిలో భాగం అయింది.

అప్పటి నుండి ఇప్పటివరకు పద్మజ వివాదాల జోలికి వెళ్ళటం జరగలేదు. భర్త, పిల్లల కోసం పాటు పడింది. ఆమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా ఉండేది. ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సహాయం చేసింది. తన నగలు అమ్మి అప్పులు తీర్చమని చెప్పగా ఆ విషయం తెలిసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట. ఆ సమయంలోనే చిరు, పవన్ కలిసి నాగబాబుని ఆర్ధికంగా గట్టెక్కించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకి సాగుతున్నాడు. ఇక కూతురు నిహారిక‌ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాకపోవటంతో పెళ్లి చేసుకొని వెబ్ సిరీస్ నిర్మాణంలో సెటిల్ అయింది. ఆమెకు భర్త ప్రోత్సాహం కూడా ఉంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM