Bones : ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అయితే ఒక్కొక్కసారి కొన్ని సంకేతాల ద్వారా ఎముకలు బలహీనంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా ముఖ్యం. క్యాల్షియం శరీరంలో తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి.
వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకలు అరిగిపోవడం సహజమే. బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, కీళ్ల నొప్పులు ఇలా అనేక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎముకలు బలాన్ని కోల్పోతాయి. నెమ్మదిగా కుళ్ళిపోతాయి. అందుకని ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా అవసరం. చాలామంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు. వెన్నునొప్ ని అసలు లైట్ తీసుకోకండి.
అనారోగ్యకరమైన ఎముకలకు ఇది సంకేతం అని తెలుసుకోండి. గోళ్ళని బట్టి కూడా మనం క్యాల్షియం లోపం ఉందని గ్రహించొచ్చు. గోళ్ళపై చర్మం దెబ్బ తినడం, గోళ్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనపడితే పోషకాహార లోపం అని గ్రహించాలి. పోషకాహార లోపం వలన ఎముకలు బలహీనంగా మారాయని గ్రహించాలి. తగిన పోషకాలని తీసుకోవడం అవసరం. ఏదైనా మీరు పట్టుకోలేకపోతున్నట్లయితే కూడా ఎముకలు బలహీనంగా ఉన్నాయని గ్రహించాలి.
నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటి సంకేతాలను బట్టి కూడా మనం ఎముకల సమస్య అని తెలుసుకోవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు లేదంటే నడుస్తున్నప్పుడు సులభంగా పగుళ్లు వంటివి ఎముకల సమస్య ప్రమాదాన్ని ఇంకొంచెం పెంచుతాయి. నోటి ఆరోగ్యం బట్టి కూడా మనం ఎముకల సమస్యల్ని గుర్తించొచ్చు. దంతాల సమస్యల వంటివి కలిగితే కూడా ఎముకలు బలంగా లేవని గ్రహించాలి. దంతాలు ఊడిపోవడం వంటివి కూడా కొంతమందిలో కనబడతాయి. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కచ్చితంగా అది ఎముకల సమస్య అని గుర్తుపెట్టుకోండి. ఎముకలు బలహీనంగా ఉన్నాయని గ్రహించండి. వైద్యుడి సలహా తీసుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…