Banana With Ghee : అరటిపండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఉదయం పరగడుపున తింటే మంచిది. ఉదయం సమయంలో తింటే అలసట, నీరసం వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.
అలాగే కండరాలు దృఢంగా ఉండి వాటి పనితీరు బాగుంటుంది. నెయ్యిలో ఉండే విటమిన్ డి ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అరటిపండులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గ్యాస్, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అరటిపండు, నెయ్యిలో ఉండే ప్రొటీన్లు బరువు తక్కువ ఉన్నవారిలో బరువును పెంచుతాయి.
అరటిపండు, నెయ్యి చర్మానికి చాలా మేలును చేస్తాయి. అరటిపండు, నెయ్యి తినడం వల్ల చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై సహజమైన మెరుపును తెస్తాయి. అలాగే చర్మం మెరుస్తూ అందంగా మారుతుంది. ఇలా ఈ మిశ్రమంతో ఎన్నో లాభాలు ఉన్నాయి కనుక దీన్ని రోజూ తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…