Aloe Vera For Face : ఆకుల పైన ముళ్లు, లోపల గుజ్జుతో ఉండే అలోవెరా (కలబంద)లో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో అధిక శాతం మంది ఇళ్లలో ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుతున్నారు. దీనికి తోడు కలబంద గుజ్జు కూడా మనకు రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. అయితే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న కలబందతో చర్మం, జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక టీస్పూన్ అలోవెరా జెల్, 1/2 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టీస్పూన్ ఇన్‌స్టాంట్ ఓట్‌మీల్‌లను ఒక చిన్నపాత్రలో తీసుకుని పేస్ట్‌గా వచ్చే వరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. దీని వల్ల ముఖంపై ఏర్పడే ముడతలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా కనిపించవు. యాంటీ ఏజింగ్ కారకంగా ఈ మిశ్రమం పనిచేస్తుంది.
కలబంద ఆకును తీసుకుని దాంట్లోని గుజ్జును సేకరించాలి. ఇలా సేకరించిన గుజ్జును ఒక పాత్రలో నిల్వ చేసి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ కొంత మొత్తంలో కలబంద గుజ్జును తీసి ముఖంపై సున్నితంగా మర్దనా చేస్తూ రాయాలి. ఇలా చేస్తే ముఖం మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాదు మొటిమలతో బాధపడుతున్న వారు కూడా ఈ పద్ధతిని ట్రై చేయవచ్చు. ఒక టేబుల్‌స్పూన్ కలబంద గుజ్జు, 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలపాలి. దీన్ని రాత్రిపూట ముఖంపై రాయాలి. ఉదయాన కడిగేయాలి. దీని వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మానికి ప్రకాశం చేకూరుతుంది. మచ్చల వంటివి తొలగిపోతాయి.
ఎండ కారణంగా కమిలిపోయిన చర్మంపై కలబంద గుజ్జును రాస్తే ఫలితం ఉంటుంది. ఇది వాపులను కూడా తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కలబందలో పుష్కలంగా ఉన్నాయి. కలబంద గుజ్జును గాయాలు, వాపులు, పురుగు కుట్టిన ప్రదేశాల్లో రాస్తే ఉపశమనం లభిస్తుంది. షేవింగ్ చేసుకున్న తరువాత కలబంద గుజ్జును ముఖానికి రాస్తే మంట, దురద తగ్గుతాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…