Triyuginarayan Temple : హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్దరు దంపతులు ఒక్కటయ్యే శుభ ముహూర్తాన దేవతలు, దేవుళ్లు కూడా ఆశీర్వదిస్తారు. దంపతులిరువురు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే భార్యాభర్తల జీవితం మరింత సుఖమయంగా ఉండాలంటే ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాలయాన్ని దర్శించాలట. దీంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయట.
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగినారాయణ్ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు పార్వతీ దేవి శివున్ని వివాహమాడాలని తలచి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. దీంతో పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాలయంలో విష్ణువు సమక్షంలో పార్వతిని వివాహం చేసుకున్నాడట. అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వారితోపాటు పెళ్లయిన వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వారి దాంపత్య కష్టాలు తొలగుతాయట. దీంతోపాటు మరెన్నో విశేషాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి.
ఈ దేవాలయంలో ఉన్న హవన్ కుండ్ అనే ప్రదేశంలో బ్రహ్మ దేవుడి సాక్షిగా పార్వతి, శివుడు ఒకటయ్యారట. ఇదే ప్రదేశాన్ని దంపతులు దర్శించుకుంటే వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఈ శివాలయంలో ఉన్న అఖండ్ ధుని అనే ప్రదేశంలో ఎల్లప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుందట. ఇక్కడే పార్వతీ శివులు మంట చుట్టూ 7 అడుగులు నడిచారని చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి అఖండ్ ధుని ఆలయం అనే పేరు కూడా వచ్చిందట. శివాలయంలోనే ఉన్న నీటి కొలనులో శివ పార్వతుల కల్యాణం తరువాత బ్రహ్మ స్నానం చేశాడట. అందుకే ఈ కొలనుకి బ్రహ్మ కుండ్ అనే పేరు వచ్చింది. ఈ కొలనులో మునిగితే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఆలయంలోనే ఉన్న మరో కొలనులో విష్ణువు స్నానం చేశాడట. ఈ క్రమంలో ఆయన పార్వతీ దేవికి సోదరుడిగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంతోపాటు శివ పార్వతుల కల్యాణం కూడా జరిపించాడట. అందుకే ఈ కొలనును విష్ణు కుండ్ అని వ్యవహరిస్తారు. దేవాలయంలో ఉన్న మరో నీటి కొలనులో శివుడు ఇతర దేవతలతో కలిసి స్నానం చేశాడట. అందుకే దీన్ని రుద్ర కుండ్ అని పిలుస్తారు. శివుడు తన వివాహానికి ముందు ఇక్కడ స్నానమాచరించాడట. అయితే ఇక్కడ స్నానం చేసే దంపతులకు సంతాన సమస్య తొలగిపోతుందని విశ్వసిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…