Allam Murabba : చలికాలంలో, దీనిని ఒక్క ముక్క తీసుకుంటే చాలు, ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు. జలుబు, దగ్గు, పైత్యం, వికారం, గ్యాస్ మొదలు చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. చలికాలం మొదలైంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఈ కాలంలో వస్తూ ఉంటాయి. చలికాలంలో, సమస్యల్ని పోగొట్టడానికి, అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లం మురబ్బా తీసుకుంటే, ఎన్నో లాభాలను పొందవచ్చు. ఉదయం పరగడుపున అల్లం మురబ్బాని ఒక ముక్క తింటే చాలు. ఎంతో చక్కటి ఫలితం ఉంటుంది. ఘాటైన అల్లం, తియ్యని బెల్లం రెండిటితో రుచి చాలా బాగుంటుంది.
అల్లం మురబ్బా తినడానికి మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, అలవాటైపోతే మాత్రం రోజు తీసుకోవచ్చు. దీనికోసం, మీరు 100 గ్రాముల దాకా అల్లం తీసుకోండి. శుభ్రంగా కడిగేసి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి. ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి నీటిని పోయకుండా, మెత్తని పేస్ట్ లాగ చేసుకోవాలి. 100 గ్రాముల అల్లానికి, 400 గ్రాములు బెల్లం కావాలి.

పొయ్యి మీద పాన్ పెట్టి, బెల్లం వేసి, ఒక కప్పు నీళ్లు పోసుకోండి. తీగపాకం వచ్చేదాకా ఉంచేసి, అల్లం పేస్ట్ వేసి, పాకం వచ్చేదాకా కలపాలి. బాగా పాకం వచ్చిన తర్వాత, నెయ్యి రాసిన పళ్ళెంలో, ఈ మిశ్రమాన్ని వేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా పరగడుపున, ఈ ఒక్క ముక్క తింటే, జలుబు, దగ్గు, పైత్యం, వికారం, గ్యాస్ వంటి బాధలు తగ్గిపోతాయి. పరగడుపున తిన్నట్లయితే, నాలుగు రెట్లు అధికంగా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా ఈజీగా తగ్గిపోతాయి. జీర్ణ ప్రక్రియ కూడా బాగా ఉంటుంది. ఆకలి లేని వాళ్ళల్లో, ఆకలి పుడుతుంది. అల్లం మురబ్బా ని, పంచదారతో కూడా చేస్తూ ఉంటారు. పంచదారకి బదులు, మనం ఇంట్లోనే ఈజీగా బెల్లంతో తయారు చేసుకోవచ్చు. అటు అల్లం లో ఇటు బెల్లంలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ లో తరచుగా, జీర్ణ సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి, అల్లాన్ని, బెల్లాన్ని తీసుకుంటే మంచిది. చిన్నపిల్లలకి కూడా పెట్టొచ్చు.