Keedaa Cola OTT Release Date : టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లేటెస్ట్ సినిమా ‘కీడా కోలా’ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. విమర్శకుల నుంచి మంచి రివ్యూలను సంపాదించింది. ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా ఆరు కోట్ల కలెక్షన్లను రాబట్టింది.క్రైం, కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయినా ఎందుకనో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా స్థాయిలో జనాలకు కనెక్ట్ కాలేకపోయింది.
తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లకు వరకు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది. అయితే సినిమా విడుదలై 4 వారాలు కావస్తుండడంతో చిత్రాన్ని డిసెంబర్ రెండో వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అయింది. తాజా సమాచారం మేరకు ఈ క్రైమ్ కామెడీ మూవీ ఆహా ఓటీటీలో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కీడా కోలా సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు చైతన్యరావు, రాగ్ మయూర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. డబ్బు అవసరం చాలా ఉన్న తాతా మనువడు ఓ షాప్ లో కీడా కోలా అనే కూల్ డ్రింక్ కొనగా అందులో బొద్దింక వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, ఓ గ్యాంగ్ స్టర్ తరుణ్ భాస్కర్ ఎంట్రీతో వారి ఫ్లాన్ మారి కథ ఎలా మలుపులు తిరిగింది అనే తదితర సన్నివేశాలతో సినిమా రూపొందింది.

2018లో వచ్చిన ‘ ఈ నగరానికి ఏమైంది?’ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తీసిన సినిమా ‘కీడా కోలా’నే. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఈ చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను తీసే చివరి కామెడీ సినిమా కీడా కోలానేనని దర్శకుడు తరుణ్ భాస్కర్ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా తర్వాత కామెడీ సినిమాలు కాకుండా వేరే జోనర్ సినిమాలు చేస్తానని తరుణ్ భాస్కర్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో ఓటీటీలోకి రానున్న ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి.