సాధారణంగా మనం ఏదైనా పండుగలప్పుడు లేదా శుక్రవారం 20 రోజులలో ప్రత్యేకంగా స్వామివారికి నైవేద్యం తయారుచేసి పెడతాము. ఈ విధంగా నైవేద్యంగా సమర్పించే బెల్లం అన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*ఒక కప్పు బియ్యం
*ఒక కప్పు బెల్లం పొడి
*అర కప్పు నెయ్యి
*జీడిపప్పు తగినన్ని
*యాలకులు టేబుల్ స్పూన్
*కిస్ మిస్ తగినంత
*పచ్చి కొబ్బెర తురుము అర కప్పు
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు బియ్యం లోకి రెండు కప్పుల నీటిని వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం 90% ఉడకగానే అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకులు వేసి మెత్తగా గరిటతో కలియబెడుతూ ఉండాలి.తర్వాత ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ వేయించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి వేయించుకున్న జీడిపప్పు కిస్ మిస్ వేయాలి. అదే విధంగా మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం అన్నం తయారైనట్లే. అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వరకు మనం రుచి చూడకూడదు.