సాధారణంగా మనకు పలు రకాల పండ్లు కొన్ని సీజన్‌లలోనే లభిస్తాయి. కూరగాయలు అయితే దాదాపుగా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. కానీ చింత చిగురు మాత్రం ఈ సీజన్‌లోనే లభిస్తుంది. ఈ సీజన్‌లోనే దాన్ని తినాలి. చింత చిగురును పలు ఇతర పదార్థాలతో కలిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చింత చిగురు రొయ్యలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురు రొయ్యలు తయారీకి కావల్సిన పదార్థాలు
- చింత చిగురు
- పచ్చి రొయ్యలు
- ఉల్లిపాయలు
- పచ్చి మిర్చి
- పసుపు
- కారం
- నూనె
- ఉప్పు తగినంత
తయారు చేసే విధానం
స్టవ్ వెలిగించి దానిపై పాత్ర పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలను, నిలువుగా చీల్చిన పచ్చి మిరప కాయలను వేసి బాగా వేయించాలి. అనంతరం ఆ పాత్రలో కొద్దిగా పసుపు వేయాలి. మళ్లీ వాటిని వేయించాలి. తరువాత రొయ్యలను వేయాలి. అవి వేగాక ఉప్పు, కారం వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు చింత చిగురు వేసుకోవాలి. మళ్లీ వాటిని వేయించాలి. తరువాత కూరలో నీళ్లు పోయాలి. బాగా ఉడికించాలి. ఉప్పు తగినంత వేశారో లేదో చెక్ చేసుకోవాలి. నీరు పోయేవరకు కూరను దగ్గరగా ఉడికించాలి. అనంతరం స్టవ్ నుంచి దింపాలి. దీంతో రుచికరమైన చింత చిగురు రొయ్యల కూర సిద్ధమవుతుంది. దీన్ని అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.