సాధారణంగా పొంగల్ వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే కొబ్బరి పాలతో తయారు చేసుకునే పొంగల్ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.కేవలం తినడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగజేసే ఈ కొబ్బరి పాల పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*కొబ్బరి పాలు ఒక కప్పు
*బియ్యం అర కప్పు
*పెసరపప్పు మూడు టేబుల్ స్పూన్లు
*నీళ్లు అర కప్పు
*నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
*డ్రై ఫ్రూట్స్ గుప్పెడు
*ఉప్పు తగినంత
*ఏలకుల పొడి కొద్దిగా
*చక్కెర ఒక కప్పు
తయారీ విధానం
ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్ లోకి పెసరపప్పు వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తరువాత నీళ్లు, సగం కొబ్బరి పాలు, బియ్యం, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో కలియబెట్టి మిగతా సగం కొబ్బరిపాలు, పంచదార వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం మొత్తం చిక్కగా అయ్యే వరకు చిన్న మంటపై కలియ పెట్టుకుంటూ చివరిగా ఏలకులపొడి, డ్రై ఫ్రూట్స్, మిగిలిన నెయ్యి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పాల పొంగల్ తయారైనట్లే.