సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే ముందుగా వ్యాధి లక్షణాలు మనలో కనపడతాయి. ఆ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ విధంగానే మన శరీరంలో డయాబెటిస్ కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆ లక్షణాలను ముందుగా గుర్తించినా,మరికొందరు గుర్తించలేరు. మరి మన శరీరంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
*ఒక వ్యక్తి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారంటే వారిలో ముందుగా కనిపించే లక్షణం నోరు పొడిబారడం. నోరు పొడిబారడం, నోట్లో పుండ్లు ఏర్పడటం, మాట్లాడటానికి లేదా నమ్మడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
*డయాబెటిస్ బారినపడే వారిలో నోరు పొడిబారడమే కాకుండా దంతాల చుట్టూ, చిగుళ్ల కింద లాలాజల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో చక్కెర పరిమాణం క్రమంగా తగ్గిపోతుంది. ఈ విధంగా చిగుళ్ల వ్యాధి బారిన పడిన వారి శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి.
*మధుమేహంతో బాధపడే వారిలో చిగుళ్ళు, దంతాల సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే చిగుళ్ల చుట్టూ కఫం ఏర్పడటం వల్ల దంతక్షయం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇతర వ్యాధిగ్రస్తులతో పోలిస్తే మధుమేహంతో బాధపడే వారిలో దంతక్షయం రెండింతలు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా నోరు పొడిబారటం, చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా డయాబెటిస్ బారిన పడతారని అలాంటి లక్షణాలు ఉన్నవారు తొందరగా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.