దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ
బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరినీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*మైదాపిండి రెండు కప్పులు
*రవ్వ మూడు టీస్పూన్లు
*తురిమిన కొబ్బరి మూడు టీ స్పూన్లు
*చక్కెర రెండు కప్పులు
*2 కప్పులు నూనె
*తగినంత బాదం
*పాలు కొద్దిగా
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, రెండు స్పూన్ల రవ్వ, ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా పాలను కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి రెండు కప్పుల పంచదార రెండు కప్పుల నీటిని వేసి బాగా మరిగించాలి. అదేవిధంగా స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టి వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ త్రిభుజాకారంలో చేసి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా తయారైన పూరీలను షుగర్ సిరఫ్ లో వేసుకోవాలి. అరగంట తర్వాత కొబ్బరి తురుము వేసి అలంకరించుకొని తింటే ఎంతో అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.