ఎన్నో పోషకాలు కలిగిన బాదంలతో రకరకాల రెసిపీ తయారు చేసుకొని తింటుంటారు.ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే పోషకాలు కలిగినటువంటి బాదం లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బాదం పప్పు 2 కప్పులు
*చిక్కటి పాలు
*నెయ్యి 5 టేబుల్ స్పూన్లు
*పంచదార పొడి రెండు కప్పులు
*కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు
*డ్రై ఫ్రూట్స్ కొద్దిగా
తయారీ విధానం
ముందుగా బాదం పప్పులను మిక్సీకి పౌడర్ గా చేసి పెట్టుకోవాలి. తరువాత ఈ పౌడర్ ను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేతిలో వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ బాదం మిశ్రమంలోకి పంచదార పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా పాలను కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిపై డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం పప్పు లడ్డూలు తయారైనట్లే.