నిరుద్యోగ అభ్యర్థులకు కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ శుభవార్తను తెలిపింది.మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్‌సీఎల్ ) వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 1500 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఉద్యోగాలకు 8వ తరగతి, పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2021 జూలై 9 వ తేదీ ఆఖరి తేదీ.
ఈ దరఖాస్తులో భాగంగా వెల్డర్ ఖాళీలు 100, ఫిట్టర్ 800, ఎలక్ట్రీషియన్ 500, మోటార్ మెకానిక్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 జూన్ 30 నాటికి తప్పనిసరిగా 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జూలై 9 2021 చివరి తేది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరింత సమాచారం కొరకు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ నుంచి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.https://nclcil.in/