ఇది వరకు మనం గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా తయారు చేసుకొని తినే ఉంటాం. అయితే కొత్తగా ఏమైనా తినాలని భావించే వారు తప్పకుండా ఈ బంగాళా దుంప హల్వా ప్రయత్నించాల్సిందే.మరి ఎంతో రుచి కరమైన ఈ బంగాళదుంప హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బంగాళదుంపలు 5
*మైదా ఒక కప్పు
*పాలు ఒక కప్పు
*నెయ్యి అరకప్పు
*పంచదార పొడి ఒకటిన్నర కప్పు
*యాలకల పొడి టీ స్పూన్
*బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా
*ఫుడ్ కలర్
తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను బాగా శుభ్రం చేసి వాటిపై ఉన్న తొక్క తొలగించాలి. తరువాత బంగాళదుంపలను చిన్నగా తరిగిపెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై ఒక కడాయి ఉంచి కొద్దిగా నెయ్యి వేయాలి .తర్వాత చిన్నమంటపై ఈ బంగాళాదుంపల తురుమును వేసి బాగా వేయించాలి. బంగాళాదుంపల తురుము మాడకుండా ఎంత వేగితే అంత రుచికరంగా ఉంటుంది. ఈ బంగాళా తురుము బాగా వేగిన తరువాత ఇందులోకి పాలు, పంచదార పొడి, ఫుడ్ కలర్ (అవసరమైతేనే వేసుకోవాలి లేకపోతే లేదు) వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడికితే మెత్తటి ముద్దలాగా తయారవుతుంది. ఈ మిశ్రమంలోకి బాదం, జీడిపప్పు, ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ మిశ్రమం చల్లారిన తరవాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచి కరమైన బంగాళాదుంపల హల్వా ఆస్వాదించవచ్చు.