యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడా ..అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి మనకు తెలిసిందే.
గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కాంబోలో మరో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా తర్వాత తారక్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.అయితే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బిజీగా ఉన్న తారక్ తర్వాత కొరటాల శివ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ , తారక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.