చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఈ క్రమంలోనే చికెన్ తో వివిధ రకాల రెసిపీ తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. ఈక్రమంలోనే కరకరలాడే చికెన్ పాప్ కార్స్ అంటే చిన్న పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం రెస్టారెంట్లు అలాగే కరకరలాడే క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
* బోన్‌లెస్ చికెన్ 250 గ్రా
* వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
* నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్
* ఉప్పు రుచికి సరిపడా
* జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్
* గరం మసాలా ఒక టేబుల్ స్పూన్
* బ్రెడ్ 4
* గుడ్లు 1
* పాలు 1 టేబుల్ స్పూన్
* మైదాపిండి 1/2 కప్పు
* నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రపరచుకోవాలి. ఈ చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచాలి. తరువాత పాన్ పై నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ ముక్కలను మిక్సీ జార్ లో పౌడర్ చేసే ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ లోకి జీలకర్ర మసాలా కలుపుకోవాలి.
మరొక గిన్నెలో గుడ్డును పగలగొట్టి అందులో పాలు పోసి బాగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. స్టౌ పై మరో కడాయిని గురించి చికెన్ ముక్కలను వేయించడానికి నూనె వేసి నూనె మరిగించాలి. తర్వాత ఫ్రిజ్ లో ఉంచిన చికెన్ ముక్కలను తీసుకొని వాటిని ముందుగా కోడి గుడ్డు మిశ్రమంలో డిప్ చేసి తరువాత బ్రెడ్ పౌడర్ లో దొర్లించాలి. ఆ తర్వాత మరోసారి గుడ్డు మిశ్రమంలో లిఫ్ట్ చేసి మరొకసారి బ్రెడ్ పౌడర్లో, చికెన్ ముక్కలకు మొత్తం బ్రెడ్ అంటుకునే విధంగా దొర్లించే నూనె వేడయ్యాక నూనెలో వేసి చిన్న మంటపై బాగా బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. వేడి వేడిగా ఉన్న ఈ క్రిస్పీ చికెన్ ముక్కలను మనకు నచ్చిన సాస్ వేసుకొని వేడిగా తింటే అచ్చం రెస్టారెంట్ రుచిని కలిగి ఉంటుంది. మరింకెందుకాలస్యం ఈ సింపుల్ రెసిపీని మీరూ ట్రై చేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…