స్కూళ్లలో చాలా మంది సైంటిఫిక్ ప్రయోగాలను చేసే ఉంటారు. పలు భిన్న రకాల వస్తువులను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం నేర్చుకునే ఉంటారు. అయితే అరటి పండ్లను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చా ? అంటే.. అవును, చేయవచ్చనే సమాధానం చెప్పవచ్చు.
అరటి పండ్ల తొక్కలను మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఆనోడ్ రియాక్టర్ బాక్స్‌లో లేదా బయో చాంబర్‌లో ఉంచాలి. ఇక క్యాథోడ్ చాంబర్‌లో నీటిని నింపాలి. ఈ క్రమంలో అరటి పండు తొక్క మిశ్రమం పులుస్తుంది. అందులో సూక్ష్మ జీవులు తయారవుతాయి. దీంతో ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా అవి క్యాథోడ్ వద్దకు వెళ్తాయి. ఇలా చిన్నగ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
అరటి పండ్లలో విద్యుత్ నిరోధకత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాగా పండిన అరటిపండ్లను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. వాటిల్లో నిరోధకత ఇంకా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి అరటి పండ్లలో ఉండే తేమ కారణంగా పలు అయానిక్ చర్యలు జరుగుతాయి. అందుకనే అరటి పండ్ల నుంచి విద్యుత్ జనిస్తుంది. ఇక ఫ్రిజ్‌లో ఫ్రీజ్ డ్రైడ్ చేయబడిన అరటి పండ్లలో నిరోధకత ఎక్కువగా ఉంటుంది. కనుక అవి విద్యుత్ ఉత్పత్తికి పనికిరావు. అలాగే అరటి పండ్ల రకం, వ్యాసం, పొడవు, పండిన శాతం వంటి అంశాల ఆధారంగా వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ శాతం మారుతుంది. కావాలంటే భిన్న రకాల అరటి పండ్లతో ప్రయోగాలను చేయవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…