ప్రతిరోజు చికెన్ తో ఒకేరకమైన వంటలు చేసుకొని తినాలి అంటే ఎంతో బోర్ గా అనిపిస్తుంది.అందుకోసమే ఈ రోజు ఎంతో వెరైటీగా కొత్తిమీర చికెన్ రోస్ట్ తయారు చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. కొత్తిమీర చికెన్ రోస్ట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇద్దరు రుచికరమైన కోతిమీర చికెన్ రోస్ట్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*చికెన్ 500 grams
*కారం పొడి టేబుల్ స్పూన్
*గరంమసాలా టేబుల్ స్పూన్
*అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*నూనె
*ఉప్పు తగినంత
*కొత్తిమీర తురుము ఒక గుప్పెడు
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్ లోకి కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట సమయం పాటు ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత స్టౌ పై మరొక పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టిన మిశ్రమం మొత్తం వేసి బాగా కలియబెట్టాలి. ఈ విధంగా చికెన్ మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ చిన్నమంట పై బాగా ఉడికించాలి. ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా కొత్తిమీర చికెన్ రోస్ట్ తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.