ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలు కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందటానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఇప్పటివరకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే గర్భం దాల్చిన మహిళలకు కూడా వ్యాక్సిన్ వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.కరోనా గర్భిణీ స్త్రీలకు కూడా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ వేయించుకునే ముందు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఆ విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
*గర్భిణీ స్త్రీలు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఓ అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉండాలి.
*వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలలో ఏవైనా సమస్యలు ఎదురైతే సొంత వైద్యం చేసుకోకుండా ముందుగా వైద్యుని సంప్రదించాలి.
*గర్భిణీ స్త్రీలు ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే అలాంటి వారు వ్యాక్సిన్ వేసుకునే ముందుమీ గైనకాలజిస్టును సంప్రదించి వారి సలహా సూచనల మేరకే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది.
*గర్భిణీ స్త్రీల వాక్సినేషన్ విషయంలో వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రమే వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. కనుక వ్యాక్సిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుని సలహాలు పాటించాలి.
*ఈ విధంగా గర్భిణి స్త్రీలు వ్యాక్సిన్ వేయించుకునే ముందు తప్పనిసరిగా ఈ సూచనలను పాటించాలి.