సాధారణంగా ప్రతి శని లేదా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమలపాకులు అంటే స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన చెప్పవచ్చు. ఈ విధంగా స్వామివారికి తమలపాకులతో పూజ చేయటం వల్ల ఎందుకంత ప్రీతి చెందుతారు. తమలపాకులకు ఆంజనేయస్వామికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణం ప్రకారం లంకాదహనం జరిగిన తర్వాత ఆంజనేయుడి శరీరం మొత్తం గాయాలయ్యాయి.ఈ సమయంలోనే రాముడు ఆంజనేయుని పక్కన కూర్చోబెట్టుకుని అతని గాయాలపై తమలపాకులను ఉంచడం వల్ల హనుమంతుడి శరీరంపై గాయాలు బాధపెట్టకుండా చల్లబరిచాయని చెబుతారు. అందుకోసమే అప్పటి నుంచి ఆంజనేయస్వామికి తమలపాకుల అంటే ఎంతో ప్రీతికరం.
హనుమంతుడికి పూజ చేసే సమయంలో తమలపాకుల మాల సమర్పించడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తులకు కోరిన కోరికలను తీరుస్తారని పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు.కేవలం తమలపాకుల మాత్రమే కాకుండా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.