Chanakya : ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటిస్తే ఎలాంటి వ్యక్తినైనా ఇట్టే మన దారిలోకి తెచ్చుకోవచ్చట..! ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలను, వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. ఈ క్రమంలో ఏ వ్యక్తినైనా మన దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పనే అవుతుంది. ఎందుకంటే ఒకరి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మన దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వారిని మాత్రం ఇట్టే మన దారికి తెచ్చుకోవచ్చట. అందుకోసం ఆచార్య చాణక్యుడు పలు విషయాలను తెలియజేశాడు. అవేమిటంటే..
కోపంగా ఉండే మనస్తత్వం ఉన్న వారి ఎదుట చాలా మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. ఎల్లప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. దీంతో వారు ఆటోమేటిక్‌గా కూల్ అయి కొంత శాంతి చెందుతారు. ఆ క్రమంలో మన దారికి వస్తారు. మూర్ఖపు స్వభావం ఉన్న వారిని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలట. వారినే ఎల్లప్పుడూ ఫాలో కావాలట. దీంతో వారు ఆటోమేటిక్‌గా మన కంట్రోల్‌లోకి వచ్చేస్తారట. ఒక వేళ మన ఎదుట మనకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులు ఉంటే వారితో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడాలట. దీంతో వారు మన పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ మన దారిలోకి వస్తారు.
బాగా ఈగో మనస్తత్వం ఉన్న వారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్లప్పుడూ మర్యాదగా ఉంటూ, అదేవిధంగా ప్రవర్తించాలి. దీంతో వారు ఆటోమేటిక్‌గా మన మాట వింటారు. స్వార్థం ఉన్న వారు, అత్యాశాపరులను సులభంగా బుట్టలో పడేయవచ్చు. వీరికి కొంత ధనం ఆశ చూపితే చాలు, మన దారిలోకి వచ్చేస్తారు. చిన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలతో లొంగదీసుకోవచ్చు. 5 సంవత్సరాల వయస్సు వరకు వారిని అమితమైన గారాబంగా, ప్రేమతో పెంచాలి. అదే 10 ఏళ్ల లోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్రవర్తన చేయకూడదు. ఇక 16 ఏళ్ల లోపు వారు, ఆపైన వారితోనైతే తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాల్సి ఉంటుంది.
పైన చెప్పిన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతోనే కాదు, ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. ప్రధానంగా చాలా క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట. అదే మంచి ఫలితాలను ఇస్తుందట. ఒక వ్యక్తికి ఉన్నటువంటి సహజసిద్ధమైన అతని స్వభావాన్ని తెలుసుకోవాలంటే అతని మాటలు, ప్రవర్తన ఆధారంగా దాన్ని నిర్ణయించవచ్చట. ఇలా చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన చిట్కాలను చెప్పాడు. వాటిని పాటిస్తే మన జీవితం ఎంతో సుఖమయం అవుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…