Ashwagandha Powder : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ వంటివి చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. నరాల బలహీనత లేకుండా నరాలు యాక్టివ్ గా ఉండేలా చేయడానికి ఇప్పుడు చెప్పే పొడి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఆ పొడి అశ్వగంధ పొడి. ఇది అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది. అశ్వగంధ పొడి ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా సహాయ పడుతుంది. మనలో మానసిక ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ వంటివి ఉన్నప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ను స్ట్రెస్ హార్మోన్ అని అంటారు.
ఈ హార్మోన్ ఎంత ఎక్కువ విడుదల అయితే మనకు స్ట్రెస్ అంత ఎక్కువగా ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయి బ్యాడ్ హార్మోన్స్ పెరిగిపోతాయి. దాంతో శరీరంలో అనేక రకాల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ని తగ్గించడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. ఇది నరాల యొక్క యాక్టివిటీని పెంచి మెదడుకు రిలాక్స్ కలిగించేలా చేస్తుంది. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటానికి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అయితే అశ్వగంధ పొడిని పావు స్పూన్ మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలుపుకుని రాత్రి పూట తాగవచ్చు. ఈ విధంగా 15 రోజుల పాటు వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది.
అశ్వగంధ శరీరం అంతటా నాడీ కణాల పునరుత్పత్తికి సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. అశ్వగంధ నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే నాడీ వ్యవస్థ నష్టాన్ని నయం చేసే శరీర సామర్థ్యాన్ని ప్రేరేపిస్తుంది. దాంతో నరాలకు సంబందించిన సమస్యలు ఏమీ ఉండవు. అల్జీమర్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…