కరోనా ఏమోగానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఫేక్ వార్తలు రోజూ విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అసలు సోషల్ ప్లాట్‌ఫాంలలో వస్తున్న వార్తలను నమ్మాలో, లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. కోవిడ్ బాధితులు నల్ల మిరియాలు, అల్లం, తేనెలను తీసుకుంటే కరోనా త్వరగా తగ్గుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో ఎంత మాత్రం నిజంలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ట్వీట్ చేసింది. ప్రజలు ఇలాంటి వార్తలను చూసి నమ్మవద్దని సూచించింది. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను చదివి నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
एक #फ़र्ज़ी खबर में दावा किया जा रहा है कि पांडिचेरी विश्वविद्यालय के एक छात्र ने #COVID19 का घरेलू उपचार ढूंढ लिया है व @WHO द्वारा भी इसे स्वीकृति दी गई है।
ऐसे भ्रामक संदेश साझा न करें। #कोविड19 से जुड़ी सही जानकारी हेतु आधिकारिक सूत्रों पर ही विश्वास करें। pic.twitter.com/Utepz7OYps
— PIB Fact Check (@PIBFactCheck) April 25, 2021
కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెరిగిపోయాయి. కొందరు పనిగట్టుకుని మరీ ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఫేక్ వార్తలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అలాగే మీడియా సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి.