వినోదం

Yamuna : ఫ్యామిలీ దూరం పెట్ట‌డంతో సూసైడ్ చేసుకోవాల‌ని అనుకున్నా.. య‌మున కామెంట్స్..

Yamuna : 1990ల్లో సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల న‌టి యమున‌. ఈమె చాలా మంది హీరోల‌తో క‌లిసి న‌టించింది. వెండితెరపై ఎన్నో హిట్ సినిమాలు చేస్తూనే సడెన్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చారు. విధి, అన్వేషిత, రక్త సంబంధం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్ తోను తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది యమున‌. నిజానికి యమున అసలు పేరు ‘ప్రేమ’. కానీ ఆమెకు డైరెక్టర్ బాలచందర్ ‘యమున’ అని పేరు మార్చారు. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం, పుట్టింటి పట్టుచీర ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేసింది.. నిజానికి ఆమె న‌టించిన‌ ‘పుట్టింటి పట్టుచీర’ సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి పోటీ ఇచ్చింది.

సినిమాల్లో మంచి పీక్ స్టేజిలో ఉన్నప్పుడే యమున బుల్లితెరపైకి వచ్చేశారు. ‘అన్వేషిత’ సీరియల్ చేయాలని సుమ‌న్ ఆమెను ప‌ట్టుబ‌ట్ట‌డంతో అందులో న‌టించాల్సి వ‌చ్చింద‌ట‌. ‘విధి’ సీరియల్ కూడా నేను చేయకూడదు అనుకున్నాను. అది నెగెటివ్ రోల్ అని ముందు వద్దన్నాను. కానీ అందులో నేనే మెయిన్ అని విలన్ కాదని చెప్పడంతో ఓకే చేసింద‌ట‌.. అది చేసినందుకు చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆ సీరియల్‌లో రోజీ అనే క్యారెక్టర్ ఇప్పటికీ ఆడియన్స్‌కు గుర్తుంది అని య‌మున ఓ సంద‌ర్భంలో పేర్కొంది. ఓ వ్యభిచార కేసులో ఆమె పట్టుబడినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆమె దీనిపై న్యాయ పోరాటం చేసి గెలిచింది. తన తప్పు ఏం లేదని నిరూపితమయ్యింది.కోర్ట్ నుంచి క్లీన్‌ చీట్‌ వచ్చింది.

Yamuna

రీసెంట్‌గా యమున సుమ షోకి హాజ‌రైంది. ఇందులో తన లైఫ్‌లోని చీకటి రోజులను గుర్తుచేసుకుంది. సోషల్‌ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల తన ఫ్యామిలీ చాలా మంది తమని దూరం పెట్టారని య‌మున పేర్కొంది. అలాంటి వార్త‌ల వ‌ల‌న సూసైడ్ కూడా చేసుకోవాల‌ని అనుకున్నాం అంటూ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది యమున‌. ఆమె మాట‌లు వింటూ యాంకర్‌ సుమతోపాటు మిగిలిన సీరియల్‌ ఆర్టిస్టులు, ఆడియెన్స్ సైతం కాస్త ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే య‌మున‌పై ఇప్పటికీ కూడా వ్యభిచారంకి సంబంధించిన వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వాటిపై కొన్ని సార్లు సీరియ‌స్‌గా రియాక్ట్ అవుతుంటుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM