Yamuna : 1990ల్లో సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల నటి యమున. ఈమె చాలా మంది హీరోలతో కలిసి నటించింది. వెండితెరపై ఎన్నో హిట్ సినిమాలు చేస్తూనే సడెన్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చారు. విధి, అన్వేషిత, రక్త సంబంధం ఇలా ఎన్నో హిట్ సీరియల్స్ తోను తెలుగు ప్రేక్షకులని అలరించింది యమున. నిజానికి యమున అసలు పేరు ‘ప్రేమ’. కానీ ఆమెకు డైరెక్టర్ బాలచందర్ ‘యమున’ అని పేరు మార్చారు. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం, పుట్టింటి పట్టుచీర ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేసింది.. నిజానికి ఆమె నటించిన ‘పుట్టింటి పట్టుచీర’ సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి పోటీ ఇచ్చింది.
సినిమాల్లో మంచి పీక్ స్టేజిలో ఉన్నప్పుడే యమున బుల్లితెరపైకి వచ్చేశారు. ‘అన్వేషిత’ సీరియల్ చేయాలని సుమన్ ఆమెను పట్టుబట్టడంతో అందులో నటించాల్సి వచ్చిందట. ‘విధి’ సీరియల్ కూడా నేను చేయకూడదు అనుకున్నాను. అది నెగెటివ్ రోల్ అని ముందు వద్దన్నాను. కానీ అందులో నేనే మెయిన్ అని విలన్ కాదని చెప్పడంతో ఓకే చేసిందట.. అది చేసినందుకు చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆ సీరియల్‌లో రోజీ అనే క్యారెక్టర్ ఇప్పటికీ ఆడియన్స్‌కు గుర్తుంది అని యమున ఓ సందర్భంలో పేర్కొంది. ఓ వ్యభిచార కేసులో ఆమె పట్టుబడినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆమె దీనిపై న్యాయ పోరాటం చేసి గెలిచింది. తన తప్పు ఏం లేదని నిరూపితమయ్యింది.కోర్ట్ నుంచి క్లీన్ చీట్ వచ్చింది.

రీసెంట్‌గా యమున సుమ షోకి హాజరైంది. ఇందులో తన లైఫ్‌లోని చీకటి రోజులను గుర్తుచేసుకుంది. సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల తన ఫ్యామిలీ చాలా మంది తమని దూరం పెట్టారని యమున పేర్కొంది. అలాంటి వార్తల వలన సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నాం అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది యమున. ఆమె మాటలు వింటూ యాంకర్ సుమతోపాటు మిగిలిన సీరియల్ ఆర్టిస్టులు, ఆడియెన్స్ సైతం కాస్త ఎమోషనల్ అయ్యారు. అయితే యమునపై ఇప్పటికీ కూడా వ్యభిచారంకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిపై కొన్ని సార్లు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంటుంది.