Mangalavaram OTT Release Date : ఆర్ఎక్స్ 100 కాంబో అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ రీసెంట్‌గా మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనకు లక్కీ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ తో కలిసి.. మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు అజయ్. నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్‌తోపాటు ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ చిత్ర నిర్మాణ భాగస్వామి కాగా ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ట్రైలర్, పోస్టర్లతో అంచనాలు పెరిగిన మంగళవారం మూవీ వైవిధ్యమైన కథతో ప్రేక్షకులని అలరిస్తుంది. మిక్స్ డ్ జోనర్‌లో తెరకెక్కిన మంగళవారం సినిమాలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఉన్నాయి.. బోల్డ్ సీన్స్ ఆకట్టునేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. దేశ వ్యాప్తంగా 5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల రూపాయలు.. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.
మంగళవారం మూవీ హక్కులని ఆహా దక్కించుకుంది.ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో డిసెంబర్ 10 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యేఅవకాశం ఉందని ఓ టాక్ నడుస్తుంది.. కలెక్షన్స్ మంచిగా వస్తుంటే మాత్రం కాస్త లేటవచ్చు లేదంటే అదే సమయానికి మంగళవారం చిత్రం ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. అజనీష్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పాయల్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…