Varalaxmi Sarathkumar : అదిరిపోయే అందంతో పాటు విలక్షణమైన నటనతో సౌతిండియాలో ప్రత్యేక ఇమేజ్ అందిపుచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్‌కుమార్. తెలుగుతో పాటు తమిళంలోను వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ అలరిస్తుంది. శరత్ కుమార్ కూతురుగా వరలక్ష్మీ ప్రపంచానికి సుపరిచితురాలు కాగా , ‘పోడా పొడి’ అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి ఫేమస్ అయిపోయింది. దీనికితోడు హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించడం.. తర్వాత బ్రేకప్ చెప్పడం, విలనిజం పాత్రలు పోషించడం వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో వరలక్ష్మీ పేరు తెగ మారుమ్రోగిపోతుంది.
‘విక్రమ్ వేదా’, ‘విష్మయ’, ‘మానిక్యా’, ‘కసాబా’ వంటి చిత్రాల్లో రెచ్చిపోయి నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్… ‘పందెం కోడి 2’, ‘సర్కార్’ వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ అమ్మడు రవితేజ చిత్రం ‘క్రాక్’లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్రతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ‘నాంది’, ‘యశోద’ వంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. వీర సింహారెడ్డిలో బాలకృష్ణకు చెల్లెలిగా అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కోటబొమ్మాలి పీఎస్ సినిమాతో త్వరలో పలకరించబోతుంది.

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కోట బొమ్మాళి పీఎస్ సినిమాకు ‘అర్జున ఫల్గుణ’ డైరెక్టర్ తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తుండగా, చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న వరలక్ష్మీ మాట్టాడుతూ.. తమిళంలో చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను కానీ, తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రతి స్ర్కిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా అని చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.