Lavanya Tripathi : టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య ఇటీవల నవంబర్ 1న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ, త్రిపాఠి ఫ్యామిలీ హాజరై దగ్గరుండి జరిపించారు. ఇక ఇండియాకు తిరిగివచ్చిన ఈ జంట.. నవంబర్ 5న సినీ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ జరుపుకున్నారు. ఇండస్ట్రీకి చెందన చాలా మంది ప్రముఖులు వీరి రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులకి శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులు షూటింగ్ బిజీలో పడిపోయిన వరుణ్ తేజ్.. ఇటీవల అత్తారింటి వాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు.
లావణ్య త్రిపాఠి తన జీవితంలో ఎక్కువ సమయం డెహ్రాడూన్‌లో గడిపినందున, ఆమె తన స్వస్థలం లో తన కుటుంబ సభ్యులను మరియు స్నేహితుల కోసం రిసెప్షన్ ప్లాన్ చేసుకుంది.తాజాగా వారి రిసెప్షన్ పిక్ బయటకు రాగా, వరుణ్ తేజ్ తెల్లటి కుర్తా పైజామాలో జాకెట్ ధరించి కనిపించాడు. ఇక లావణ్య త్రిపాఠి నీలం రంగు దుస్తులు ధరించింది. వారి పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ పూర్తయ్యాక ఈ జంట హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. హానీ మూన్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలి నగరంని సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే వీరు బాలీకి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది.

ఇక లావణ్య త్రిపాఠి రీసెంట్గా తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ, ఆసక్తికర కామెంట్ పెట్టింది. నా భర్త ఎంతో అద్భుతమైన మనిషి.. చాలా దయా హృదయం ఉన్న వాడు.. ఎంతో కేరింగ్‌గా చూసుకునేవాడు.. అతని గురించి చెప్పాల్సింది ఇంకా ఎంతో ఉంది కానీ.. అది మా ఇద్దరి మధ్యలోనే ఉంచుతా.. మూడు రోజులు పెళ్లి అనే దాని గురించి చాలా కలలు కన్నాం. మా ఫ్యామిలీల సమక్షంలో అది జరగాలని అనుకున్నాం.. పెళ్లి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్.. అంటూ లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.లావణ్య పోస్ట్‌కు లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్. ప్రస్తుతం లావణ్య పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇక లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీరకి ఒక ప్రత్యేకత ఉంది. చీరపై వరుణ్ లవ్ అని రాసి ఉన్న డిజైన్ ని కూడా లావణ్య రివీల్ చేసింది.