వినోదం

Urvashi Rautela : బాల‌య్య‌తో ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మైన గ్లామ‌ర్ గర్ల్స్.. ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Urvashi Rautela : సీనియ‌ర్ హీరోల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఒక‌వైపు సినిమాల‌తో పాటు మ‌రోవైపు ఓటీటీలోను దుమ్మురేపుతున్నాడు.చివరిగా బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ఇప్పుడు త‌న 109వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఎన్‌బీకే 109’ వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను దర్శకుడు బాబీ అనంతపురంలో ప్లాన్‌ చేశాడు. ఈ నెల మూడోవారం నుంచి బాలయ్యపై అక్కడ యాక్షన్‌ సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌ చిత్రీకరించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా అనంతపురంలోనే ఉంటుందని తెలుస్తున్నది. ఈ చిత్రం కేవలం యాక్షన్‌ డ్రామా మాత్రమే కాదని, కుటుంబనేపథ్యంలో సాగే భావోద్వేగ ప్రయాణమని సమాచారం. కథానుగుణంగా ద్వితీయార్థంలో పొలిటికల్‌ సన్నివేశాలు ఉంటాయని యూనిట్‌వర్గాల సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక ఇందులో ఇద్ద‌రు గ్లామ‌ర‌స్ హీరోయిన్స్‌ని అనుకుంటున్న‌ట్టు ప్ర‌చారం నడుస్తుంది. బాలకృష్ణ సరసన మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల స‌మాచారం.

Urvashi Rautela

ఇక బాబీ దర్శకత్వం వహించిన చివ‌రి చిత్రం ‘వాల్తేరు వీరయ్య సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రత్యేక గీతం చేశారు. ఇప్పుడీ బాలకృష్ణ సినిమాలో కూడా ఆమె ఉంటున్నారని తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై బాబీ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. సీన్లతో పాటు సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.మరోవైపు బాలయ్య ‘అఖండ2’ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే మొదలైందని తెలుస్తున్నది. బోయపాటి కథ కూడా సిద్ధం చేశారట. ఈ రెండోభాగం సోషియోఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM