Urvashi Rautela : సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస విజయాలు సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు ఓటీటీలోను దుమ్మురేపుతున్నాడు.చివరిగా బాలయ్య భగవంత్ కేసరి అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించగా, ఇప్పుడు తన 109వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఎన్‌బీకే 109’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను దర్శకుడు బాబీ అనంతపురంలో ప్లాన్ చేశాడు. ఈ నెల మూడోవారం నుంచి బాలయ్యపై అక్కడ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించనున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా అనంతపురంలోనే ఉంటుందని తెలుస్తున్నది. ఈ చిత్రం కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాదని, కుటుంబనేపథ్యంలో సాగే భావోద్వేగ ప్రయాణమని సమాచారం. కథానుగుణంగా ద్వితీయార్థంలో పొలిటికల్ సన్నివేశాలు ఉంటాయని యూనిట్‌వర్గాల సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇందులో ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్‌ని అనుకుంటున్నట్టు ప్రచారం నడుస్తుంది. బాలకృష్ణ సరసన మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఇక బాబీ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘వాల్తేరు వీరయ్య సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రత్యేక గీతం చేశారు. ఇప్పుడీ బాలకృష్ణ సినిమాలో కూడా ఆమె ఉంటున్నారని తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై బాబీ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. సీన్లతో పాటు సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.మరోవైపు బాలయ్య ‘అఖండ2’ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని తెలుస్తున్నది. బోయపాటి కథ కూడా సిద్ధం చేశారట. ఈ రెండోభాగం సోషియోఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.