వినోదం

Unstoppable With NBK : విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ర‌ష్మికని అడిగిన బాల‌య్య‌.. భలే ఇరుక్కుపోయిందే..!

Unstoppable With NBK : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ‌కాలంగా హీరోగా స‌త్తా చాటుతున్న హీరో బాల‌కృష్ణ‌. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అదే సమయంలో ఆహా సంస్థ కోసం అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షోను చేస్తోన్నారు. ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరో దానితో వస్తోంది. తాజా సీజన్‌లో కొత్త ఎపిసోడ్‌ కోసం యానిమల్ టీమ్ రాగా, వారికి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగారు బాల‌య్య .తాజాగా షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో బాలయ్య యానిమల్ టీంతో కలిసి రచ్చ చేశారు.

రణబీర్ , రష్మిక లతో కలిసి డ్యాన్సులు బాల‌య్య వారిద్ద‌రిని సరదా ప్రశ్నలు అడిగారు. ప్రోమో అంతా ఫుల్ ఫన్ గా సరదాగా సాగిపోయింది. అయితే ఈ ప్రోమోలో రష్మికతో విజయ్ దేవరకొండ గురించి టాపిక్ తీసుకువచ్చారు బాలయ్య. విజయ్ కి రష్మికతో కాల్ చేయించారు. విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే.. వాట్సాప్ రే అంటూ క్యూట్ గా అన్నాడు. దీంతో అక్కడ షోలో ఉన్న ఆడియన్స్ అరవగా రష్మిక సిగ్గుపడింది. ఆ తర్వాత సందీప్ వంగ విజయ్ తో మాట్లాడుతుంటే.. మీ హీరోకి చెప్పు ఐ లవ్ రష్మిక అని అన్నారు బాలయ్య. అలాగే.. రష్మిక మాట్లాడుతుంటే.. మేడ మీద పార్టీలు ఏంటన్నా అని బాలయ్య విజయ్ దేవరకొండని అడిగాడు. దీంతో మరోసారి రష్మిక సిగ్గుపడుతూ నవ్వేసింది.

Unstoppable With NBK

రష్మిక, విజయ్ దేవరకొండ( ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలు కొట్టేసినా, ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, రష్మిక విజయ్ ఇంట్లో పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఇంట్లో రష్మిక ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో వీళ్ళ రిలేషన్ మీద రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య కూడా అడగడం, విజయ్ మాట్లాడగానే రష్మిక సిగ్గుపడటంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏమన్నా ఉందా, ఉంటే చెప్పేయొచ్చు కదా అని అంటున్నారు అభిమానులు. దీంతో మరోసారి విజయ్ – రష్మిక వైరల్ గా మారింది. ఇక సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా బాలయ్య వెళ్లి ‘మీ హీరోకు చెప్పమ్మా.. ఐలవ్ రష్మిక’ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడగా.. అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత రణ్‌బీర్‌ను ‘నువ్వు ఆలియాది కాకుండా ఎవరి సోషల్ మీడియా అకౌంట్ తరచూ చూస్తావు’ అని ప్రశ్నించారు. ఇలా ఈ ప్రోమో సాగింది. దీంతో ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM