Unstoppable With NBK : తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలంగా హీరోగా సత్తా చాటుతున్న హీరో బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అదే సమయంలో ఆహా సంస్థ కోసం అన్‌స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తోన్నారు. ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరో దానితో వస్తోంది. తాజా సీజన్‌లో కొత్త ఎపిసోడ్ కోసం యానిమల్ టీమ్ రాగా, వారికి సంబంధించి అనేక ఆసక్తికర ప్రశ్నలు అడిగారు బాలయ్య .తాజాగా షోకి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో బాలయ్య యానిమల్ టీంతో కలిసి రచ్చ చేశారు.
రణబీర్ , రష్మిక లతో కలిసి డ్యాన్సులు బాలయ్య వారిద్దరిని సరదా ప్రశ్నలు అడిగారు. ప్రోమో అంతా ఫుల్ ఫన్ గా సరదాగా సాగిపోయింది. అయితే ఈ ప్రోమోలో రష్మికతో విజయ్ దేవరకొండ గురించి టాపిక్ తీసుకువచ్చారు బాలయ్య. విజయ్ కి రష్మికతో కాల్ చేయించారు. విజయ్ కాల్ లిఫ్ట్ చేయగానే.. వాట్సాప్ రే అంటూ క్యూట్ గా అన్నాడు. దీంతో అక్కడ షోలో ఉన్న ఆడియన్స్ అరవగా రష్మిక సిగ్గుపడింది. ఆ తర్వాత సందీప్ వంగ విజయ్ తో మాట్లాడుతుంటే.. మీ హీరోకి చెప్పు ఐ లవ్ రష్మిక అని అన్నారు బాలయ్య. అలాగే.. రష్మిక మాట్లాడుతుంటే.. మేడ మీద పార్టీలు ఏంటన్నా అని బాలయ్య విజయ్ దేవరకొండని అడిగాడు. దీంతో మరోసారి రష్మిక సిగ్గుపడుతూ నవ్వేసింది.

రష్మిక, విజయ్ దేవరకొండ( ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలు కొట్టేసినా, ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, రష్మిక విజయ్ ఇంట్లో పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఇంట్లో రష్మిక ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో వీళ్ళ రిలేషన్ మీద రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య కూడా అడగడం, విజయ్ మాట్లాడగానే రష్మిక సిగ్గుపడటంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏమన్నా ఉందా, ఉంటే చెప్పేయొచ్చు కదా అని అంటున్నారు అభిమానులు. దీంతో మరోసారి విజయ్ – రష్మిక వైరల్ గా మారింది. ఇక సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా బాలయ్య వెళ్లి ‘మీ హీరోకు చెప్పమ్మా.. ఐలవ్ రష్మిక’ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడగా.. అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత రణ్‌బీర్‌ను ‘నువ్వు ఆలియాది కాకుండా ఎవరి సోషల్ మీడియా అకౌంట్ తరచూ చూస్తావు’ అని ప్రశ్నించారు. ఇలా ఈ ప్రోమో సాగింది. దీంతో ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.