Sreeleela : సినీ పరిశ్రమలో ఎప్పుడు, ఎవరు, ఎలా విజయం సాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లుదు. కొందరు సాదా సీదాగా పరిశ్రమలోకి వచ్చి పెద్ద స్టార్ అయిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలోని హీరోయిన్లలో ప్రస్తుతం శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి హీరో తమ పక్కన నటించడానికి శ్రీలీలే కావాలంటూ డైరెక్టర్లకు సిఫార్సు చేస్తూ ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఆమె పేరే వినపడుతోంది. పెళ్లిసందD సినిమాద్వారా టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ అమ్మడు ఆరోజు నుంచి ఈరోజు వరకు వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీగా ఉంటోంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించారు. బాలకృష్ణ కూతురుగా.. శ్రీలీల కనిపించింది. అలాగే ప్రియురాలి పాత్రలో కాజర్ అగర్వాల్ తెగ సందడి చేస్తోంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమాపై కొందరు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ శ్రీలీలను పెట్టుకొని ఆమె అందాన్ని పెద్దగా హైలెట్ చేయలేకపోయారని, అలాగే ఆమెతో మాంచి మాస్ స్టెప్పులు కూడా వేయించలేరని అన్నారు. ఇక శ్రీలీల నటించి ఆదికేశవ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో శ్రీలీలా కూడా పాల్గొంది. ఈ సినిమాలో తొలిసారిగా తన పేరుపై విడుదల చేసిన సాంగ్ ను ప్రమోట్ చేస్తోంది.
అయితే ప్రమోషన్‌లో భాగంగా ఓ షూటింగ్ స్పాట్ లో కొందరు వృద్ధులతో శ్రీలీలా చేసిన డాన్స్ వైరల్ గా మారింది. ఈ సాంగ్ అంటే తనకెంత ఇష్టమో ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.ముసలాడైనా తన డాన్స్ చూస్తే స్టెప్పులేయాల్సిందేనని అనిపించిందని చెబుతూ, ఆ వీడియోను తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా పంచుకుంది శ్రీలీల. అభిమానులు లీలమ్మ క్రేజ్ మాములుగా లేదుగా అంటూ స్పందిస్తున్నారు. అటు చదువుకుంటూ ఇటు సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇండస్ట్రీలో తెగ సందడి చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…