వినోదం

Naga Chaitanya : ఇంట్లో ఖాళీగా ఉన్నానంటూ కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన అక్కినేని వార‌సుడు

Naga Chaitanya : అక్కినేని మూడోత‌రం వార‌సుడు నాగ చైత‌న్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న జోష్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌గా ప్ర‌స్తుతం మాత్రం వైవిధ్య‌మైన సినిమాల‌తో రాణిస్తున్నాడు. రీసెంట్‌గా ధూత అనే సినిమాతో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న ఈయన తాజాగా యూట్యూబర్ గా మారాడు. అసలు సోషల్ మీడియా అంటేనే నచ్చని ఈయన… ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నప్పటికీ చై ఎక్కువగాపెద్ద‌గా వాడిన సంద‌ర్భాలు లేవు. ఎప్పుడో ఓసారి తన సినిమాల గురించి మాత్రమే వాటి ద్వారా అప్ డేట్లు ఇస్తుంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే నాగ చైత‌న్య యూట్యూబ్ ఛానెల్ వాడ‌డం నిర్ణయం వెనుక గల కారణాలు ఏంటీ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్‌ను రూపొందించిన నాగ చైత‌న్య‌.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఇక ఈ యూట్యూబ్‌లో నెటిజ‌న్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స్పందించాడు చైతూ. ఇదంతా చూస్తుంటే ఆయన కేవలం తన సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు రీజన్ ఏంటని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేగు, ఇంట్లో ఖాళీగా ఉన్నా, పనేంలేక జుట్టు, గడ్డం పెంచానంటూ కామెడీ చేశాడు చై.

Naga Chaitanya

నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న NC23 సినిమా రూపొందుత‌న్న విష‌యం తెలిసిదే. ఈ చిత్రం కోసమే జుట్టు, గడ్డం పెంచినట్లు ఆ తర్వాత చెప్పారు. అలాగే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్ జరగ్గగా… రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయన్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి మరోసారి చై పక్కన హీరోయిన్ గా నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను మొదటి సారిగా చేసిన దూత వెబ్ సిరీస్ గురించి కూడా పలు ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందిప‌డుతున్న చైత‌న్య ఈ సారి మాత్రం మంచి హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM