నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు ఆయనకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్సను అందిస్తూనే ఉన్నారు. గత ఏడు రోజులుగా తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టు సమాచారం. అయితే మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. దీంతో నందమూరి తారకరత్న విషయంలో ఏం జరుగుతోందనే చర్చ జరుగుతోంది.
తాజా ఆరోగ్య పరిస్థితిపై స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నందమూరి తారకరత్నను ఎయిర్ అంబులెన్సులో విదేశాలకు ఎయిర్ లిఫ్ట్ చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. తారకరత్నను ఏ క్షణమైనా విదేశాలకు తరలించే అవకాశం ఉందని.. బాలయ్య బాబు కూడా తారకరత్న యోగక్షేమాలు చూసుకునేందుకు ఎయిర్ అంబులెన్సులో వెంట వెళ్తారని టాక్.
గుండెపోటు వచ్చినప్పటి నుండి నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లను సంప్రదిస్తూ.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. కాగా గుడెపోటు వచ్చిన టైమ్ లో 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన తారకరత్న మెదడులో మెదడులో నీరు చేరి మెదడు వాచిందని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…