ఆఫ్‌బీట్

చాలా వ‌ర‌కు సినిమాల‌ను శుక్ర‌వారం రోజే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా..?

శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తుంటాయి. వేరే రోజుల కంటే కూడా శుక్రవారం రోజే సినిమాల‌ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నారు నిర్మాతలు. అయితే అసలు సినిమాలు ఆ రోజునే ఎందుకు విడుదల అవుతాయో తెలుసా ? తెలియకుంటే ఈ వార్త చదవాల్సిందే. ఇలా శుక్రవారాల‌లో సినిమాలను విడుదల చెయ్యడం ప్రారంభం అయింది మన దేశంలో కాదు. ఈ ట్రెండ్ ని మొదలు పెట్టింది హాలీవుడ్ పరిశ్రమ. ప్రపంచంలో మొదట 15 డిసెంబర్ 1939 శుక్రవారం రోజున విడుదలైన గాన్ విత్ ద విండ్ సినిమాతో ఈ ట్రెండ్ మొద‌లైంది. అదే కంటిన్యూ అవుతూ వ‌స్తోంది.

ఆ మూవీ అప్ప‌ట్లో ఘన విజయం సాధించింది. దాంతో అప్పటి నుంచి శుక్రవారం సినిమాలు విడుదలవడం ఆనవాయితీగా మారింది. ఇక మన దేశంలో అదేవిధంగా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా మొఘల్ ఎ అజమ్. ఈ మూవీ కూడా బంప‌ర్ హిట్ అయి ఒక క్లాసిక‌ల్‌గా మిగిలింది. దీన్ని అప్ప‌ట్లో బ్లాక్ అండ్ వైట్‌లో రిలీజ్ చేయ‌గా.. ఈ టెక్నాల‌జీ యుగంలో ఈ మూవీని క‌ల‌ర్‌లోనూ మార్చి మ‌ళ్లీ రిలీజ్ చేశారు. ఇక ఇందులోని పాట‌ల‌ను ఇప్ప‌టికీ ఎంతో మంది వింటుంటారు. అప్పట్లో మొఘ‌ల్ ఎ అజ‌మ్‌ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో అది సెంటిమెంట్ గా మారిపోయి మన దేశంలో శుక్రవారం సినిమాలు విడుదలవుతూ వస్తున్నాయి.

అంతే కాదు మన దేశంలో శుక్రవారం సినిమా విడుదలను ఎంచుకోవడానికి మరో కారణం ఉంది. అదేటంటే.. శుక్రవారం లక్ష్మీ దేవి రోజు. ఆ రోజు తమ సినిమాలని విడుదల చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మడం మొదలుపెట్టారు. మరొక కమర్షియల్ కారణం ఏంటంటే.. శుక్ర‌వారం త‌రువాత వ‌చ్చేది వీకెండ్‌. శ‌ని, ఆది వారాలు. దీంతో స‌హ‌జంగానే ప్ర‌జ‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం చూస్తారు. కొత్త మూవీలు విడుద‌ల అయి ఉంటే వాటిని చూసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. దీంతో థియేట‌ర్లు నిండిపోతాయి. మొద‌టి 3 రోజులు క‌లెక్ష‌న్స్ బాగా వ‌స్తాయి. దీంతో న‌ష్టాల నుంచి చాలా వ‌ర‌కు గ‌ట్టెక్క‌వ‌చ్చు. అందుక‌నే ఈ కార‌ణాల చేత‌నే శుక్ర‌వారం రోజునే సినిమాల‌ను రిలీజ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అదే ట్రెండ్ ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతూ వ‌స్తోంది.

Share
IDL Desk

Recent Posts

Chintha Chiguru Pulihora : చింత చిగురు పులిహోర త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Chintha Chiguru Pulihora : పులిహోర‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌పండు, మిరియాల పొడి,…

Thursday, 16 May 2024, 4:05 PM

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని…

Thursday, 16 May 2024, 11:30 AM

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో…

Wednesday, 15 May 2024, 8:20 PM

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి…

Wednesday, 15 May 2024, 3:39 PM

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది…

Wednesday, 15 May 2024, 9:08 AM

Mangoes : మామిడి పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటితో క‌లిపి తిన‌కండి.. లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో జ‌నాలు అంద‌రూ చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.…

Tuesday, 14 May 2024, 8:11 PM

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను చేయ‌డం రావ‌డం లేదా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Jonna Rotte : చ‌పాతీ, రోటీ, నాన్‌.. తిన‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్ట‌లేసుకుంటూ…

Tuesday, 14 May 2024, 5:01 PM

Gold Price Today : బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గుతున్న ధ‌ర‌లు..!

Gold Price Today : ఈమ‌ధ్య‌కాలంలో బంగారం ధ‌ర‌లు ఎలా పెరిగాయో అంద‌రికీ తెలిసిందే. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయాయి. అయితే…

Tuesday, 14 May 2024, 8:20 AM