సోషల్ మీడియాలో ఇటీవల సెలబ్రిటీలకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారు ఏ వాచ్ ధరిస్తున్నారు, ఏ బ్రాండ్ వస్తువులు వాడుతున్నారు, ఎలాంటి లగ్జరీ కార్లలో ప్రయాణిస్తున్నారు వంటి అంశాలపై తెగ పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ స్టైల్, గాడ్జెట్స్, స్టైలింగ్ గురించి వాటికి సంబంధించిన కాస్ట్ గురించి వరుసగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు చిరంజీవికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చి తెగ సందడి చేశాడు.
తన వింటేజ్ లుక్ గుర్తుచేసేలా ఉన్న వాల్తేరు వీర్య సినిమా ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. డ్యాన్సులు, ఫైట్స్ తో దుమ్మురేపారు. ఈ ఊపులో ‘భోళా శంకర్’ షూటింగ్ లో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో మెగాస్టార్ వాచీల కాస్ట్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయింది. సినిమాల ఈవెంట్స్ లో పాల్గొనే టైంలో చిరు డిఫరెంట్ డిఫరెంట్ వాచీలతో కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ దృష్టి వాటిపై పడింది. చిరు ధరించిన వాటిలో రోలెక్స్ వాచ్ అత్యంత ఖరీదైనదని తెలుస్తోంది.
రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ కాస్ట్ రూ. కోటి 86 లక్షల 91 వేల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. చిరు దగ్గర మరో వాచ్ కూడా ఉండగా, అది ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్ అది. దీని ఖరీదు రూ.33 లక్షలకు పైనే అని తెలుస్తోంది. ఇలా సినిమాలతో మాత్రమే కాకుండా వాచీల కాస్ట్ తోనూ చిరు వార్తల్లో ఉంటున్నారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన ఎంత సంపాదించిన కూడా కొంత ప్రజా సేవకి ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…