బుల్లితెర రారాణిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందిన సుమ ఇటీవలి కాలంలో తెగ విమర్శల బారిన పడుతుంది. రీసెంట్‌గా కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు. తన సొంత కుటుంబం గురించి కానీ, పర్సనల్ కానీ పట్టించుకోని అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ 30 గురించి చాల ఆతృతగా, ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసరికి ఎన్టీఆర్ కి ఎక్కడలేని కోపం వచ్చింది. సుమ వచ్చి మైక్ ఎన్టీఆర్ కి ఇవ్వగానే, వాళ్ళు అడిగారా లేదో కానీ, నువ్వే అన్నీ చెప్పేట్టు వున్నావు అని ఎన్టీఆర్ సుమకి చిన్నపాటి పంచ్ ఇచ్చాడు.దీంతో సుమ ఇది వినీ విననట్టుగా ఉండిపోయింది.
ఒకప్పుడు సుమ యాంకరింగ్‌కి వంక పెట్టేవాళ్లే లేకుండా పోయారు. కాని ఇప్పుడలా కాదు. గత 1-2 ఏళ్ల నుంచి కాస్త శ్రుతి తప్పుతోంది. ఒకప్పుడు ఈవెంట్ అంటే సుమ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడేది. ఈ మధ్య కాలంలో మాత్రం చిరంజీవి, రాజమౌళి లాంటి స్టార్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయి విమర్శల బారిన పడుతుంది. కొద్ది రోజుల ముందు కొన్నాళ్ల ముందు రాజమౌళి పాల్గొన్న ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ‘SSMB29’గురించి మాట్లాడి వారి ఆగ్రహానికి గురైంది.
ఇక ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరు స్పీచ్ లో సుమ కల్పించుకుంది. ఇక కొన్నిరోజుల ముందు ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ మీట్ లోనూ రచ్చ రవి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటే.. సుమ దాన్ని కాస్త పక్కదారి పట్టించేలా చేయడంతో కొంత విమర్శల బారిన పడిందనే చెప్పాలి. వరుసగా సుమ ఇలా వివాదాలలో చిక్కుకోవడం వలన యాంకరింగ్ శృతి తప్పుతుందని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎన్ని జరిగినా సరే సుమ అంటే పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అందరు గౌరవిస్తూనే ఉంటారు. ఎక్కడ వల్గారిటీ లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నడిపించడంలో సుమని మించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…