నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎక్కువగా వివాదాలలో నిలుస్తూ వస్తున్నారు. ఆయన వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో దేవబ్రాహ్మణల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడాడని, ఆ తరువాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావుని అవమానపరిచేలా అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించాడు అంటూ బాలకృష్ణ చుట్టూ వివాదాలు రాచుకున్నాయి. తాజాగా నర్సుల పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశాడు.
నర్సుల వివాదంపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. రోగులకు సేవలు అందించే నర్సు సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని బాలకృష్ణ స్పష్టం చేశారు. ”బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.
కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలు అందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను” అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. దేవబ్రాహ్మణల వివాదంలో కూడా బహిరంగ క్షమాపణ చెప్పిన బాలయ్య.. అక్కినేని వివాదంలో మాత్రం తాను క్షమాపణ చెప్పకుండా తన మాటలని సమర్ధించుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య మాత్రం వివాదాలతో తెగ హాట్ టాపిక్ అవుతున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…