SS Rajamouli : టాలీవుడ్ అగ్ర హీరోల్లో మాస్ హీరో ఎవరని అడిగితే.. అందుకు నందమూరి బాలకృష్ణ.. అని ఎవరైనా సరే ఠక్కున సమాధానం చెబుతారు. బాలయ్య ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచి మాస్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఆయన తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులతో పనిచేశారు కానీ రాజమౌళితో ఒక్క సినిమా కూడా తీయలేదు.
వాస్తవానికి రాజమౌళి కూడా పలు సందర్భాల్లో తనకు బాలయ్య అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. మరలాంటప్పుడు బాలకృష్ణతో రాజమౌళి ఎందుకు సినిమా తీయలేదనే ప్రశ్న ప్రేక్షకుల్లో తలెత్తుతూ ఉంటోంది. అయితే అందుకు స్వయంగా రాజమౌళి సమాధానం చెప్పారు.
త్వరలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రాజమౌళి, ఇతర ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ గెస్టులుగా కనిపించనున్న విషయం విదితమే. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే లాంచ్ చేశారు. అయితే అందులో బాలకృష్ణ.. రాజమౌళిని పలు పంచింగ్ ప్రశ్నలు అడిగారు.
గతంలో ఒకసారి రాజమౌళి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బాలకృష్ణతో ఎందుకు సినిమాలు చేయలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. బాలకృష్ణను తాను హ్యాండిల్ చేయలేనని అన్నారు. అయితే అదే విషయాన్ని బాలకృష్ణ స్వయంగా రాజమౌళిని అడిగారు. నన్ను హ్యాండిల్ చేయలేనని అన్నావు.. ఎందుకు అలా అనాల్సి వచ్చిందని.. బాలయ్య అడగ్గా.. అందుకు రాజమౌళి స్పందించారు.
బాలకృష్ణ అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఆయనంటే అందరికీ భయమే. అయితే నాతో సినిమా తీసే హీరోలను షూటింగ్ సమయంలో నా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటా. హీరో కష్ట సుఖాల గురించి ఆలోచించను. ఇది అందరు హీరోలకు నచ్చకపోవచ్చు. మీరంటే గౌరవం, భయం. మీతో కూడా అలాగే ప్రవర్తిస్తే మీరేమైనా అంటారేమోనని ఆందోళన.. అందుకనే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేనని, మీతో సినిమా తీయలేనని చెప్పా.. అదీ విషయం.. అని రాజమౌళి స్పష్టం చేశారు.
అయితే వాస్తవానికి మగధీర కథతో అప్పట్లో బాలకృష్ణ దగ్గరకు రాజమౌళి వెళ్లారట. కానీ తరువాత ఏమైందనే విషయం తెలియలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో గనక సినిమా వస్తే.. అది నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంటుందని.. గతంలో ఎన్నడూ చూడని బాలయ్యను చూసే అవకాశం లభిస్తుందని.. ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఆ విధంగా జరుగుతుందా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…