Siri Hanmanth : బుల్లితెర ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు సరికొత్త వినోదం పంచుతున్నషో జబర్ధస్త్. ఈ కార్యక్రమం నుండి పాత నీరు వెళ్లడం కొత్త నీరు రావడం జరుగుతుంది. కమెడీయన్స్, యాంకర్స్, జడ్జెస్ వెళ్లిపోవడం, కొత్త వాళ్లు తిరిగి రావడం జరుగుతుంది. అయితే జబర్ధస్త్ మాత్రం ఎప్పటికప్పుడు టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోయేది. సుధీర్,గెటప్ శ్రీను, ఆది, అనసూయ, నాగబాబు, రోజా ఇలా అందరూ జబర్దస్త్ షోను నిలబెట్టారు అని చెప్పాలి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండుగా చీలిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ షోలని రష్మీ, అనసూయలు నడిపించారు.నాగబాబు, రోజా వెళ్లి పోయాక ఈ షోకి జడ్జ్‌లుగా కృష్ణ భగవాన్, ఇంద్రజలు ఫిక్స్ అయ్యారు.
ఇక జబర్ధస్త్‌కి యాంకర్‌గా సౌమ్య, ఎక్స్ ట్రాకు రష్మీ యాంకర్లుగా ఫిక్స్ అయ్యారు. అంతా బాగుందనుకున్న టైంలోనే సౌమ్య స్థానంలో బిగ్ బ్యూటీ సిరి ఎంట్రీ ఇచ్చింది. . సౌమ్య రావుకు ఏదైనా సమస్య వచ్చి డుమ్మా కొడితే.. సిరిని పట్టుకొచ్చారా? లేదంటే సౌమ్యను తప్పించి సిరిని పెట్టుకున్నారా? అన్నది మాత్రం క్లారిటీ లేదు కాని, కొన్ని వారాల పాటు జబర్ధస్త్ షోని సిరి నడిపించనున్నట్టు తెలుస్తుంది. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్.. బిగ్ బాస్ నుంచి స్టార్ మాలో ఈవెంట్లు, షోల వరకు ఎదిగిన సిరి.. ఇప్పుడు ఈటీవీలో ఇలా మల్లెమాల వారి జబర్దస్త్ షోకు వచ్చింది. అయితే ఇప్పుడు సిరికి.. రష్మీ, అనసూయల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారనే చర్చ కూడా మొదలైంది.
యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరిసిన సిరి హన్మంత్.. రీసెంట్‌గా హిట్టైన జవాన్ సినిమాలో ఓ చిన్న పాత్రలో అలా కనిపించి అలరించింది. ఈ సినిమా తర్వాత సిరికి మల్లెమాల ప్రొడక్షన్స్ వారు యాంకరింగ్ చేసే అవకాశం ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం సిరికి ఉన్నక్రేజ్ దృష్ట్యా ఒక్కొక్క ఎపిసోడ్ కి మూడు లక్షల 50 వేలు ఇస్తున్నారట . కెరీర్ స్టార్టింగ్‌లో రష్మీ,అనసూయకి కేవలం లక్ష 50 వేలు మాత్రమే తీసుకున్నారు . అయితే సిరి హనుమంతు మాత్రం ఏకంగా దానికి డబల్ రేంజ్ లో అందుకుంటుండడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే సిరి హన్మంత్‌కి ఉన్న క్రేజ్, ఆమె ఫిగర్‌కి ఉన్న ఫోకస్ దృష్ట్యా అంత ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…