Radha Daughter Karthika : అలనాటి అందాల తార రాధ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె చిరంజీవికి జంటగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అలరించింది. ఇక రాధ పెద్ద కుమార్తె కార్తీక కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అక్కినేని నాగచైతన్య మొదటి సినిమా ‘జోష్’తో కార్తీక హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ వెంటనే ‘రంగం’ సినిమాతో హిట్ అందుకుంది కార్తీక. ఇక ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో కార్తీక నటించారు. కానీ, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయిన ఈ అమ్మడు చివరిగా 2015లో ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరపై కనిపించి ఆ తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పింది.
రాధ వారసులుగా కార్తీక నాయర్, తులసి నాయర్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రాధ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేయగా కూతుళ్లు మాత్రం ఆమె పేరుని నిలబెట్టలేకపోయారు. కార్తీక సినిమాలకి బ్రేక్ ఇచ్చాక దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ చూసుకుంటున్నారు.క్కడ తమ బిజినెస్ ని మరింత విస్తరించిన కార్తీక.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. గత అక్టోబర్ నెలలో కార్తీక ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక పెళ్లి కూడా మరి కొద్ది రోజులలోనే జరబోతున్నట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరావేగంగా జరుగుతున్నాయి. రాధనే స్వయంగా పలువురు సెలెబ్రిటీల ఇంటికి వెళ్లి ఆహ్వానాలు పంచుతున్నారు.
రీసెంట్‌గా ప్రముఖ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్ర రావును రాధ కలిశారు. ఆయన్ని పెళ్లికి ఆహ్వానించారు. తనకు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి రాధ తొలి ఇన్విటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుండగా, త్వరలో చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి ఆహ్వానం అందిచంనుందని సమాచారం. అయితే రాధకి కాబోయే అల్లుడు ఎవరు, ఏం చేస్తాడు అనే వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉన్నాయి.రాధ 1980 కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించగా, తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…