The Road Movie OTT Release Date : చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు తెలుగులో వైవిధ్యమైన సినిమాలతో అలరించింది. ఇప్పుడు మాత్రం తెలుగులో సినిమాలు తగ్గించి తమిళంలో మాత్రం వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. త్రిష కృష్ణన్ రీసెంట్‌గా నటించిన థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల కింద థియేటర్లలో రిలీజై మంచి టాక్ కొట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. శుక్రవారం (నవంబర్ 10) అర్ధరాత్రి నుంచి ది రోడ్ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి రాగా, ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.
త్రిష ఇటీవలి కాలంలో నటించిన పొన్నియన్ సెల్వన్1, 2, లియో చిత్రాలు మంచి విజయాలు సాధించగా, ది రోడ్ కూడా త్రిషకి మంచి హిట్ అందించిపెట్టింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్ డైరెక్ట్ చేయగా, అక్టోబర్ 10న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో అడుగు పెట్టింది. ఓ హైవేపై ఒకే చోట వరుసగా ప్రమాదాలు జరుగుతుండటం వెనుక మిస్టరీని ఛేదించే అమ్మాయి పాత్రలో త్రిష నటించి మెప్పించింది. మొదటి నుంచి చివరి వరకు మంచి సీట్ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందింది. పదేపదే ఒకే ప్రాంతంలో యాక్సిడెంట్స్ జరగడం దాని వెనక రహస్యం తెలుసుకునే ప్రయత్నంగా ఈ సినిమా తెరకెక్కింది.
ది రోడ్ మూవీలో త్రిషతోపాటు షబ్బీర్, సంతోష్ ప్రతాప్, మియా జార్జ్, ఎమ్మెస్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఫేక్ యాక్సిడెంట్స్‌కు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటోన్న ఓ ముఠా గుట్టును సాధారణ యువతి ఎలా కనిపెట్టింది? తన భర్త, కొడుకు మరణంపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదనే పాయింట్‌తో చిత్రం థ్రిల్లర్ మూవీగా రూపొందింది. సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…